ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేయడం సర్వసాధారణమైపోయింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ సహా పలువురు హీరోలకు సంబంధించిన సినిమాలను గతంలో రీ-రిలీజ్ చేస్తూ వచ్చారు. వాటిలో కొన్ని డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకుంటే, కొన్ని మాత్రం బోల్తా పడుతూ వచ్చాయి. కానీ, రీ-రిలీజ్ కోసం కూడా ఒక ఫంక్షన్ చేసి, నందమూరి బాలకృష్ణను ఆహ్వానిస్తే, ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందర్నీ అలరించి వచ్చాడు. అలా ఈ మధ్యనే “ఆదిత్య 369” అనే సినిమా రీ-రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా రీ-రిలీజ్ ఒక డిజాస్టర్ అని తెలుస్తోంది. ఎందుకంటే, ఈ సినిమాను రీమాస్టరింగ్ చేయడానికి ఎంత ఖర్చయిందో, అంత ఖర్చు కూడా వెనక్కి రాబట్టుకోలేకపోయిందని అంటున్నారు.
Mark Shankar Pawanovich: పవన్ ఫాన్స్ ఊపిరి పీల్చుకోండి.. మార్క్ బాబు సేఫ్..ఇదిగో ప్రూఫ్ !
నిజానికి, ఈ సినిమా అప్పట్లో డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటి జనరేషన్ ఈ సినిమాను మిస్ అవుతున్నారనే ఫీలింగ్‌తో, ఈ సినిమాను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ దీన్ని రీమాస్టర్ చేయించి, 4K వెర్షన్‌లో రిలీజ్ చేశారు. అయితే, బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా దీన్ని లైట్‌గా తీసుకున్నారో ఏమో తెలియదు, కానీ సినిమా రీ-రిలీజ్ మాత్రం ఒక మాయని మచ్చగా నిలిచిపోయింది. అసలు రీ-రిలీజ్ సినిమాల విషయాలను హీరోలు పట్టించుకోరు. కేవలం వాటిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ మాత్రమే ఆసక్తి చూపించి, రిలీజ్ చేస్తు వస్తున్నారు. కానీ, బాలకృష్ణ స్వయంగా ఈవెంట్‌కు హాజరై, సినిమా చూడాల్సిందిగా కోరినా, ఫ్యాన్స్ పట్టించుకోకపోవడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.