చాలా కాలం తర్వాత సితారే జమీన్ పర్ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఆమిర్ ఖాన్. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఆ సంగతి పక్కన పెడితే, ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాలను ఇప్పుడు చాలా గోప్యంగా ఉంచుతూ వస్తున్నాడు. అయితే, ఆయన తాజాగా తన వ్యక్తిగత విషయంలో ఒక విషయాన్ని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.
Also Read:Kannappa: కన్నప్ప’లో ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారంటే?
గతంలో రీనా దత్‌తో వివాహం విఫలమైనప్పుడు తనను మద్యానికి బానిసగా ఎలా మార్చింది, డిప్రెషన్‌కు ఎలా లోనైనాడు అనే విషయాలను ఆయన వెల్లడించాడు. “రీనా నేను విడిపోయిన తర్వాత ఆ రోజు మొత్తం నేను ఒక ఫుల్ బాటిల్ తాగి గడిపేశాను. ఆ ఒక్క రోజు మాత్రమే కాదు, అలా తర్వాత ఏడాదిన్నర పాటు రోజుకొక ఫుల్ బాటిల్ తాగేవాడిని. నిద్ర సరిగా పట్టేది కాదు. ఇంకోసారి నేను ఇలా మందు తాగి చనిపోతానేమో అనిపించేది.
Also Read:Dil Raju: నితిన్, స్టార్ అవుతావ్ అనుకున్నా.. కాలేక పోయావ్!
బయట జనాలతో మాట్లాడేవాడిని కాదు, వర్క్ మీద ఫోకస్ చేసేవాడిని కాదు. అయితే, అదే ఏడాది రిలీజ్ అయిన లగాన్ కారణంగా నన్ను ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అని పిలిచేవారు. నాకు ఈ రెండు వ్యత్యాసాలను చూసి చాలా నవ్వొచ్చేది,” అని చెప్పాడు. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్‌తో పక్కపక్క ఇళ్లలో ఉండి ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్న తర్వాత 16 ఏళ్ల పాటు సంసారం చేసి, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. అయితే, తర్వాత పలు కారణాలతో వారు విడాకులు తీసుకోవడం జరిగింది.
