కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తన కన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, శివకార్తీకేయన్.. అవలీలగా వంద కోట్లు, మూడొందల కోట్లు కొట్టేస్తుంటే… తను మాత్రం 200 క్రోర్ మార్క్ దాటడానికి నానా అవస్థలు పడుతున్నాడు. గజినీతో సౌత్‌కే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ చూపించిన ఈ వర్సటైల్ యాక్టర్.. రెట్రోతో హయ్యెస్ట్ గ్రాసర్ కలెక్షన్స్ చూసినప్పటికీ.. బొమ్మ థియేట్రికల్ రన్ దగ్గర బోల్తా పడింది. ఈ డిజాస్టర్స్ దెబ్బతో.. వర్కింగ్ స్టైల్ మార్చేశాడు రోలక్స్.
Also Read : Tollywood : ప్లాప్ సినిమాకు అవార్డు.. అమ్మడి ఆశలన్నీ ఆ సినిమాపైనే
ఆడియన్స్ ఏ సినిమాలకు పెద్ద పీట వేస్తున్నారో గ్రహించిన సూర్య.. అటుగా మూవ్ ఆన్ అవుతున్నాడు. సౌత్‌లో మార్కెట్ పెంచుకోవాలన్నా.. పాన్ ఇండియా రేంజ్ పెరగాలన్నా లోకల్ బాయ్స్‌తోనే కాదూ.. అనదర్ లాంగ్వేజ్ డైరెక్టర్లకు ఛాన్సులివ్వాలని డిసైడ్ అయ్యాడు. అటుగా మొదలెట్టిన ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి కూడా. ఇప్పటికే సూర్య 46తో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరికీ ఛాన్స్ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల టచ్‌లోకి వచ్చేస్తున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ చిత్రాలతో కాస్తో కూస్తో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సూర్య.. మరింత పెంచుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు కంప్లీట్ చేసిన సూర్య ఇటు వెంకీ అట్లూరితోనే కాకుండా మరో ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సారి మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌ను లైన్లో పెట్టినట్లు సమాచారం. రొమన్ చామ్, ఆవేశం చిత్రాలతో భారీ హిట్స్ అందుకున్న జీతూతో సూర్య 47 ఫిక్స్ చేసినట్లు కోలీవుడ్ టాక్. ఇందులో హీరోయిన్‌గా నజ్రియాను ఫైనల్ చేయనున్నారట. త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. లోకల్ దర్శకులను కాస్త పక్కన పెట్టి.. యంగ్ అండ్ డైనమిక్ నాన్ కోలీవుడ్ దర్శకులతో వర్క్స్ స్టార్ట్ చేసిన సూర్య.. మార్కెట్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే.. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ వరకు ఆగాల్సిందే. అప్పుడే కదా సూర్య 46 రిలీజయ్యేదీ మరీ.