టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా రష్మిక నటిస్తోందంటే సెంట్ పర్సెంట్ హిట్ పక్కా అన్న టాక్ తెచ్చుకుంది. అంతేకాదు వంద కోట్ల గ్యారెంటీ హీరోయిన్‌గా అవతరించింది. వారిసు నుండి రీసెంట్లీ వచ్చిన థమా వరకు చూస్తే ఆమె ఖాతాలో ఉన్నవన్నీ హండ్రెడ్ క్రోర్ మూవీసే. ప్లాపైనా సరే సల్మాన్ ఖాన్ సికందర్ కూడా రూ. 150 కోట్లను కొల్లగొట్టింది. పుష్పతో నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న రష్మిక హిందీలో కెరీర్ స్టార్ట్ చేశాక కాస్త ఆటుపోట్లు ఎదుర్కొన్నా యానిమల్ ఆమెకు బూస్టరైంది. అంతేకాదు రణ్ బీర్‌కు హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది.
Also Read : Bollywood : సల్మాన్ ఖాన్ పై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
ఆ వెంటనే వచ్చిన పుష్ప2 హిందీ, తెలుగులోనే కాదు హోల్ ఇండస్ట్రీస్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఛావా కూడా విక్కీ కౌశల్ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిపింది. ఇక తాజా ఫిల్మ్ ధమా డివైడ్ టాక్‌తో రూ. 100 కోట్ల నెట్ కలెక్షన్స్ క్రాస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్లు వసూల్ చేసింది. తొలి రోజే రూ. 25 కోట్లు కొల్లగొట్టి ఆయుష్మాన్ ఖురానా కెరీర్‌లోనే ఓపెనింగ్ డే హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో పలకరించిన నేషనల్ క్రష్ నెక్ట్స్ లేడీ ఓరియెంట్ చిత్రాలపై ఫోకస్ చేస్తోంది. నవంబర్ 7న ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ కాబోతోండగా మైసా షూటింగ్ జరుతోంది. ఇక హిందీలో కాక్ టైల్2 తో పాటు మరో ప్రాజెక్టుకు సైన్ చేసింది. విజయ్ దేవరకొండతో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫిక్సైంది. మరి ది గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక మరో వందకోట్లు తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.