డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిన అఖండ 2 ఆర్థిక సమస్యలు కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అయి ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో అఖండ 2 థియేటర్స్ లో సందడి చేయబోతుంది. అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్స్ వేసేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం మాములుగా లేదు. కానీ అఖండ 2 కు మరో అనుకోని అవాంతరం ఎదురయ్యింది.
Also Read : Breaking : మరికొన్ని గంటల్లో రిలీజ్ ఉండగా వాయిదా పడిన స్టార్ హీరో సినిమా
ఈ రోజు తెలంగాణ హైకోర్టులో అఖండ 2 ప్రీమియర్ షోలు నిర్వహణకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ రేట్లు పెంచడంపై సవాల్ చేస్తూ లంచ్-మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేయగా, సతీష్ కమల్ పిటిషనర్‌గా ఉన్నారు. ఈ కేసు ఈ రోజు మధ్యాహ్నం 2:25 గంటలకు కు హైకోర్టులో విచారణకు రావచ్చని సమాచారం. ముఖ్యంగా అఖండ 2 ప్రత్యేక ప్రదర్శనలు మరియు టికెట్ ధరల పెంపుపై ఈ పిటిషన్‌లో ప్రశ్నలు లేవనెత్తారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఎన్నో వివాదాలు వాయిదాలు, ఫైనాన్స్ క్లియరెన్సు అన్ని అడ్డంకులు దాటి రిలీజ్ కాబోతున్న అఖండ 2 కు ఇప్పడు మరో అవాంతరం ఎదురైంది. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.