దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. “ఏ మాస్టర్ పీస్” సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు. ఈ రోజు “ఏ మాస్టర్ పీస్” షూటింగ్ కవరేజ్ కు మీడియాను ఆహ్వానించారు.
Also Read :Koushik Pegallapati: ‘కిష్కింధపురి’ ఎడ్జ్ ఆఫ్ సీట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ – “ఏ మాస్టర్ పీస్” ప్రాజెక్ట్ మొదలయ్యేందుకు శ్రీకాంత్ కండ్రేగుల కారణం. ఆ తర్వాత మనీష్ గిలాడ మా చిత్ర ప్రొడక్షన్ లో భాగమై సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ఈ చిత్రంలో సూపర్ విలన్ గా నటిస్తున్నారు. అరవింద్ కృష్ణ కెరీర్ గురించి మీ అందరికీ తెలిసిందే. “ఏ మాస్టర్ పీస్” చిత్రంలో సూపర్ హీరోగా ఆయన కనిపిస్తారు. ఈ చిత్ర కథను మన పురాణా ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశాను. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది, ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్ ను, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఒక అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్ ను “ఏ మాస్టర్ పీస్” చిత్రంలో చూస్తారు. అరవింద్ కృష్ణ సూపర్ హీరోగా అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. అలాగే మనీష్ గిలాడ సూపర్ విలన్ గా ఆకట్టుకుంటాడు. డిఫరెంట్ రోల్స్ లో జ్యోతి పూర్వజ్ నా వైఫ్, ఎంతో బాగా నటించింది. మా టీమ్ అంతా నా వెన్నంటి ఉండి మూవీకి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ కథలో శివుడి నేపథ్యం ఉంటుంది కాబట్టి మేము అనుకున్న వర్క్స్ అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.