తాజాగా విడుదలైన ‘8 వసంతాలు’ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో చెప్పక్కర్లేదు. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమకథా చిత్రం, స్లో లవ్ స్టోరీగా యూత్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో అనంతిక సనీల్‌కుమార్, రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా. వీరి నటనకు ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు.. ఒక మహిళ జీవన ప్రయాణంలో ఎదురయ్యే వివిధ మలుపులను ఆవిష్కరించే చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం
Also Read : Mahesh Babu : సితార పై.. మహేష్ ఎమోషనల్ పోస్ట్ !
జూలై 11, 2025 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో కంటే డిజిటల్ విడుదలతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. సమాచారం ప్రకారం ఈ మూవీ OTTలో ట్రెండింగ్ మూవీ లిస్ట్ లో, రెండో స్థానంలో దూసుకుపోతుంది.