తాజాగా విడుదలైన ‘8 వసంతాలు’ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్లో లవ్ స్టోరీగా యూత్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమకథా చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్, రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా. వీరి నటనకు ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు.. ఒక మహిళ జీవన ప్రయాణంలో ఎదురయ్యే వివిధ మలుపులను ఆవిష్కరించే చిత్రంగా నిలిచింది. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ హృదయానికి హత్తుకునే ట్యూన్స్ ఇచ్చారు. కొన్ని పాటలు ఇప్పటికే యువతను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.
Also Read : War2 : ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ అప్‌డేట్..
సమాచారం ప్రకారం ఈ సినిమా జూలై 11, 2025 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్ కానుందట. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానుందట. ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో మామూలు రెస్పాన్స్ సంపాదించుకున్న ప్పటికీ, డిజిటల్ విడుదలతో ప్రేక్షకులకు మరింత చేరుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా ఓటీటీలో ఈ చిత్రాన్ని 2:1 ఆస్పెక్ట్ రేషియోలో ప్రదర్శించనుంది. ఇది హోమ్ స్క్రీన్‌లపై మంచి సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఉపయోగపడనుందని దర్శకుడు పేర్కొన్నారు. థియేటర్లలో అందని అనుభూతిని ఓటీటీలో అందించేలా ప్రెజెంటేషన్ ఉండబోతోంది.