దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “మగధీర” విడుదలై 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. 2009 సంవత్సరంలో విడుదలైన “మగధీర” రామ్ చరణ్ కు భారీ విజయాన్ని అందించింది. ఈ చిత్రం 12 సంవత్సరాల క్రితం ఇదే రోజు విడుదలైంది. ఇది రామ్ చరణ్‌ని స్టార్‌గా నిలబెట్టింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఎస్ఎస్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ఇదే.
Read Also : విజయ్ ఆంటోనీకి రానా సపోర్ట్
బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రాలలో “మగధీర” ఒకటి. ఇందులో రామ్ చరణ్ తన కెరీర్ ను మలుపు తిప్పే రేంజ్ లో నటనను కనబరిచారు. రాజమౌళి ఫాంటసీ డ్రామా “మగధీర” రామ్ చరణ్ కు రెండో సినిమా. రామ్ చరణ్ తన కెరీర్ ప్రారంభంలో “మగధీర” లాంటి చిత్రంలో నటించడానికి సాహసం చేయడం నిజంగా అభినందనీయం. “మగధీర” చిత్రం పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. ఇద్దరు ప్రేమికులు ఒక జీవితంలో కలుసుకోకుండానే విడిపోతారు. అదే జంట మరో జన్మలో ప్రేమికులు పుట్టి కలుసుకుంటారు. వారి బలమైన బంధాన్ని చాటే భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్, ముఖ్యంగా సంగీతం అద్భుతంగా ఉండడం ప్రేక్షకులను ఆకర్షించింది. కీరవాణి సంగీతం ప్రేక్షకులను నిజంగానే “మగధీర” లోకంలోకి తీసుకెళ్లింది. ఈ సినిమాలో చిరంజీవి అతిధి పాత్రలో నటించారు. “బంగారు కోడి పెట్ట” అనే ఐకానిక్ సాంగ్ లో ఆయన తన కొడుకుతో స్టెప్పులేయడం మరో విశేషం. ప్రస్తుతం రాజమౌళి, రామ్ చరణ్ కలిసి “ఆర్ఆర్ఆర్” కోసం పని చేస్తున్నారు.