ఈ నెల 21న ఒకే రోజు ఏకంగా 11 సినిమాలు థియేటర్ ప్రేక్షకులు అలరించేందుకు రెడీ అయ్యాయి. అయితే ఇవన్నీ చిన్న సినిమాలే కావడం విశేషం. వాటిలో రాజు వెడ్స్ రాంబాయి, 12A రైల్వే కాలనీ కాస్త నోటబుల్ రిలీజ్ అవుతున్నాయి. పదకొండు సినిమాలు ఒకేసారి పరిశీలిస్తే ..
రాజు వెడ్స్ రాంబాయి : చిన్న చిత్రాల లక్కీ నిర్మాతగా పేరొందిన వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎక్కువ సౌండ్ చేస్తదని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. కథ నేపథ్యం బాగుంటుందని వంశి నందిపాటికి మరో హిట్ పడుతుందని బజ్ అయితే నడుస్తోంది.
12A రైల్వే కాలనీ : అల్లరి నరేష్ వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ ఏవి కనీసం ఓపెనింగ్ తెచ్చుకోవడం లేదు. రైల్వే కాలనీపై కూడా ఓ మోస్తరు అంచనాలతో 21న థియేటర్స్ లో అడుగుపెడుతోంది. కానీ అల్లరి నరేష్ సినిమాకు టాక్ బాగుంటే చాలు కలెక్షన్స్ బాగుంటాయి. ఈ సినిమాతో అల్లరోడు మరో హిట్ కొడతాడేమో చూడాలి.
Also Read : Keerthy Suresh : వారంలో సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ ఎక్కడ కీర్తి?
పాంచ్ మినార్ : రాజ్ తరుణ్ సినిమాలకు ఆడియెన్స్ దూరం జరిగి చాలా కాలం అయింది. హిట్ టాక్ వస్తే ఆడియెన్స్ అటు తొంగి చూసే ఛాన్స్ ఉంది. ట్రైలర్ బాగుంది.
ప్రేమంటే : బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు చూస్తున్న ప్రియదర్శి ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఏషియన్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి టాక్ తెచుకుంటుందో చూడాలి.
వీటితో పాటు కలివి వనం, శ్రీమతి 21F, జనతాబార్, ఇట్లు మీ ఎదవ, క్షమాపణ గాద 21,(డబ్బింగ్), మఫ్టీ పోలీస్ 21 (డబ్బింగ్) మాస్క్ 21(డబ్బింగ్) సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మరి వీటిలో హిట్ టాక్ తెచుకునేది ఎవరో చూడాలి.