ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు యు ట్యూబ్ లో పిచ్చ డిమాండ్. ఆయన సినిమాలు హిందీ డబ్బింగ్ అయితే వందల కోట్ల వ్యూస్ తో పలు రికార్డులు సృస్టించాయి. ఇప్పుడు తెలుగులో కూడా బన్నీ ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘డీజే’ (దువ్వాడ జగన్నాధం). ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ అయితే ఇప్పటికే వందలాది మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇపుడు తెలుగులో నేరుగా సింగిల్ ఛానెల్ లో 100 మిలియన్ వ్యూస్ అందుకోవడం విశేషం. ఇలా తెలుగులో డైరెక్ట్ గా 100 మిలియన్ వ్యూస్ సాధించిన సినిమాలు చాలా తక్కువ. మొదట ఈ ఫీట్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’తో సాధించగా… ఇప్పుడు అదే ఫీట్ ను సాధించిన రెండో హీరోగా బన్నీ నిలిచాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ తో పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ రేర్ ఫీట్ సాధించటం పట్ల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో పాటు దర్శకుడు హరీశ్ శంకర్ కూడా తమ ఆనందాన్ని ట్విటర్లో పంచుకున్నారు.