సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ చాలా గ్యాప్ తరువాత జిమ్ లో వర్కౌట్లు మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని తమ ఇంట్లో ఏర్పాటు చేసిన జిమ్ లో నమ్రత వర్కౌట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో వర్క్ అవుట్ తరువాత దిగిన ఫోటోను షేర్ చేసిన నమ్రత ‘సుదీర్ఘ విరామం తర్వాత వ్యాయామం చేయడం ఒక ఛాలెంజ్’ అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కరోనా బారిన పడే అవకాశం తగ్గుతుందని, వైరస్ సోకిన వారు కూడా దాని నుండి త్వరగా కోలుకోవచ్చని తెలిపింది. నమ్రతా తరచూ తన కుటుంబ సభ్యుల ఫోటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంటుంది. ఇటీవలే సితార, గౌతమ్ పెరట్లో తమ పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం 2022 సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా తన వ్యక్తిగత స్టైలిస్ట్ కు కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మహేష్ బాబు ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నారు.