తెలుగు సినిమాల అసలు సిసలు స్టామినా ఏమిటో తెలిసేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే. ఇక్కడ బొమ్మహిట్ అయితే బాక్సీఫీస్ బద్దలైనట్లే. మరి అలాంటి క్రాస్ రోడ్స్ లో తొలి వారం వసూళ్ళలో తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ పదో స్థానంలో నిలవటం విశేషం. తొలి వీకెండ్ లో దూకుడు చూపించిన ‘వకీల్ సాబ్’ వసూళ్ళు సోమవారం బాగా డ్రాప్ అయ్యాయి. అయితే మంగళవారం ఉగాది సందర్భంగా మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కానీ ఆ తర్వాత బుధ, గురువారాల్లో మళ్ళీ డ్రాప్ అయ్యాయి. మొత్తం మీద తొలి వారం ముగిసేసరికి పదవ ప్లేస్ లో చోటు సంపాదించుకున్నాడు ‘వకీల్ సాబ్’.ఇక క్రాస్ రోడ్స్ లో తొలి వారం వసూళ్ళలో ఇప్పటికీ తొలి స్థానం ‘బాహుబలి2’దే. ఈ సినిమా రూ.1,66,17,811 వసూలు చేసింది. ఈ సినిమాకు దరిదాపుల్లో మరే సినిమా లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత రూ.1,16,39,781తో ప్రభాస్ నటించిన ‘సాహో’
రెండో స్థానంలో నిలిచింది. ఇక 2020 సంక్రాంతికి మహేశ్ దూకుడు చూపించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రూ.1,04,59,230తో మూడో ప్లేస్ దక్కించుకుంది. 2020లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ రూ 92,95,797తో నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో ప్లేస్ లో రూ. 92,12,430 తో మహేశ్ ‘మహర్షి’ ఉండగా… ఆరో స్థానంలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి1’ చోటు దక్కించుకుంది. ఈ సినిమా రూ.91,17,904 వసూలు చేసింది. ఏడో ప్లేస్ లో రూ. 89,76,555తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ నిలిచింది. ఎనిమదవ స్థానంలో రూ. 85,12,217 వసూళ్ళతో రజనీకాంత్ నటించిన ‘2.0’ చోటు దక్కించుకోవడం విశేషం. 9వ ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ నిలిచింది. ఈ సినిమా రూ. 84,22,065 వసూలు చేయగా పదవ స్థానాన్ని ‘వకీల్ సాబ్’ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా రూ.83,05,283 వసూళ్ళు దక్కించుకుంది. మరి రాబోయే రోజుల్లో ఏ సినిమా ‘వకీల్ సాబ్’ ని లిస్ట్ లోంచి బయటకు నెడుతుందో చూడాలి.