Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ప్రభాస్ మంచి మనసు గురించి టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియా మొత్తం తెలుసు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎలాంటి వివాదం లేని హీరోగా ప్రభాస్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఆయన ఆతిథ్యం గురించి అసలు మాట్లాడాల్సిన పని ఉండదు. తనకు నచ్చిన వారిని ప్రభాస్ ఏ రేంజ్ లో చూస్తాడు అనేది చాలామంది స్టార్లు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ప్రభాస్ తనకు నటన నేర్పిన గురువుకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 2021 లో సత్యానంద్ కు ప్రభాస్ ఒక రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. టాలీవుడ్ లోఇప్పుడు స్టార్లుగా కొనసాగుతున్న హీరోలకు గురువు ఎవరు అంటే టక్కున వైజాగ్ సత్యానంద్ పేరును చెప్పుకొస్తారు. ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా స్టార్ లందరూ సత్యానంద్ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళే. ప్రభాస్ కూడా సత్యానంద్ శిష్యుడే. అందుకే టాలీవుడ్ లోసత్యానంద్ కి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.
Sreeleela: దగ్గుబాటి వారి పెళ్ళికి స్పెషల్ గెస్ట్.. రిలేషన్ ఏంటి.. ?
ఇక చాలామంది శిష్యులు అప్పుడప్పుడు ఆయనకు ప్రత్యేకమైన బహుమానాలు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రభాస్ సైతం తన గురువు సత్యానంద్ కు బంగారు కానుకను ఇచ్చాడు. 2021 లో ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఆయనకు గోల్డ్ రోలెక్స్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. డార్లింగే స్వయంగా సత్యానంద్ ఇంటికి వెళ్లి ఆ ఆ బాక్స్ ను అన్ ప్యాక్ చేసి గురువు చేతికి తొడిగాడు. ఇక ఈ వాచ్ ను కొనడానికి ప్రభాస్ చాలా కష్టపడినట్లు తెలుస్తుంది. గురువుగారికి తెలుపు ఇష్టమని తెలుసుకొని గోల్డ్ వాచ్ ను ఆ కలర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయించి ఇచ్చినట్లు సమాచారం. శిష్యుడు ఇచ్చిన వాచ్ చూసి సత్యానంద్ ఎంతో మురిసిపోయాడు. ఇక ప్రభాస్ సైతం చాలా ఆనందంగా గురువు దగ్గర ముచ్చట్లు చెప్తూ కనిపించాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. కల్కి షూటింగ్ జరుపుకుంటుంది.