మెగాస్టార్ అంటే అంచనాలకు హద్దులు ఉండవు. సంక్రాంతి బరిలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తుందన్న వార్తతోనే మెగా అభిమానుల్లో సెలబ్రేషన్ మోడ్ ఆన్ అయిపోయింది. అయితే మధ్యలో సినీ కార్మికుల సమ్మెతో కొద్ది రోజుల పాటు షూటింగ్ ఆగిపోవడంతో, ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌పై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిర్మాత సాహు గారపాటి ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు.
Also Read: SSMB29 : ఫస్ట్ గ్లింప్స్ తో పాటు.. భారీ సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్ కూడా ఆ రోజేనా..?
ఆయన మాట్లాడుతూ.. “సమ్మె వల్ల సుమారు 15 రోజుల షూటింగ్ డిలే అయినా, మా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చాలా కోఆపరేట్ చేశారు. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. నవంబర్ 15లోపు షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతి కల్లా మీ ముందుకు సినిమాను తప్పకుండా తీసుకొస్తాం” అని ధైర్యంగా చెప్పారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నయనతార హీరోయిన్‌గా కనిపించనున్నారు. మెగాస్టార్ స్టైల్, అనిల్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసే ఈ సినిమాపై ఇప్పటికే హైప్ పెరిగిపోయింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, అప్‌డేట్‌లతోనే సోషల్ మీడియాలో హంగామా మామూలుగా లేదు. ఇక మాస్ డైలాగ్స్, ఎమోషనల్ సీక్వెన్స్‌లు, కామెడీ డోస్ అన్నీ పక్కాగా ఉన్నాయని టాక్. అందుకే ఫ్యాన్స్ మాత్రం.. “ఏం జాప్యం వచ్చినా పర్వాలేదు.. సంక్రాంతికి మెగాస్టార్ విందు ఖాయం!” అంటూ ఉత్సాహంగా ఉన్నారు.