SSMB29 : ఫస్ట్ గ్లింప్స్ తో పాటు.. భారీ సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్ కూడా ఆ రోజేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ SSMB29పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించనుండటం మరింత స్పెషల్‌గా మారింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కెన్యా, నైరోబిలో జోరుగా సాగుతోంది. మహేష్ బాబు తన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్‌కి తిరిగివచ్చారు. ఇదిలా ఉండగా, ఆగస్టు 9న మహేష్ బర్త్‌డే సందర్భంగా రాజమౌళి ఫస్ట్ గ్లింప్స్‌ను నవంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ..
తాజాగా ఫిలింసర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఆ గ్లింప్స్‌తో పాటు సినిమా అధికారిక రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందట. ఈ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని టీమ్ ఆలోచిస్తోందని సమాచారం. అయితే దీనిపై పూర్తి క్లారిటీ కోసం అభిమానులు ఎదురుచూడాల్సిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి ప్రత్యేకమైన కథా శైలితో, మహేష్ బాబు గ్లోబల్ లుక్‌తో రాబోతున్న ఈ సినిమా ప్రపంచ స్థాయి విజువల్ స్పెక్టకిల్గా ఉండబోతుందని ఇప్పటికే ఫిల్మ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి అభిమానులు ఎదురుచూస్తున్న ఈ ఎపిక్ అనౌన్స్‌మెంట్ నిజంగానే రాబోయే రోజుల్లో జరుగుతుందా..? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!