మెగాస్టార్ చిరంజీవి హార్డ్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో కొణిదెల శివ శంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. రాత్రి, పగలు అని చూడకుండా సినిమానే ప్రాణంగా భావించి ఆయన కష్టపడ్డారు కాబట్టే నేడు మెగాస్టార్ గా కొలువుండిపోయారు. కొన్నిసార్లు ఆయన పడిన కష్టం ఆయన నోటివెంట వింటుంటే కళ్ళు చెమర్చక మానవు. ఇప్పుడున్న హీరోలు కొద్దిగా కాలు నొప్పి ఉంటేనే షూటింగ్ కు పదిరోజులు సెలవు పెట్టేస్తున్నారు. కానీ చిరు సమయంలో ఆరోగ్యం బాగాలేకున్నా షూటింగ్లను పూర్తిచేసేవారు. ఎందుకంటే తన ఒక్కడి వలన ఆ రోజు సినీ కార్మికులు పడిన కష్టాన్ని వేస్ట్ చేయకూడదని, తాజాగా నేడు కార్మిక దినోత్సవరం సందర్భంగా హైదరాబాద్ యూసప్‌గూడలో నిర్వహించిన సినీ కార్మికోత్సవం కార్యక్రమంలో ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి.
” నేను జగదేకవీరుడు అతిలోకసుందరి చేస్తున్నప్పుడు 103 జ్వరంతో బాధపడుతున్నాను. అప్పుడు శ్రీదేవితో కలిసి డాన్స్ చేయాలి. అలా బాధపడుతూనే శ్రీదేవి తో కలిసి డాన్స్ చేశా.. షూటింగ్ అనంతరం 15 రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా గాడ్ ఫాదర్ కోసం ముంబాయి, మైత్రీ మూవీ కోసం హైదరాబాగాడ్‌ఫాదర్ సినిమా కోసం ముంబై, హైదరాబాద్ తిరగాల్సి వచ్చేది. నేను డల్‌గా ఉన్నానని చెబితే షూటింగ్ ఆగిపోయేది” అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే తన వలన వేసిన సెట్, షెడ్యూల్ మారడంతో మళ్లీ నిర్మాతకు ఎక్కడ నష్టం కలుగుతుందనే భావనలో అప్పట్ల హీరోలు ఎంతో కష్టపడేవారట. ఇక ఇలాంటి ఉదాహరణలు చిరు చాలా చెప్పుకొచ్చారు. నూతన్ ప్రసాద్ ట్రైన్ యాక్సిడెంట్ లో కాళ్లు పోగొట్టుకొని బాధపడుతున్న సమయంలో కూడా క్లోజప్ షాట్స్ తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా తల్లి చనిపోయి కుటుంబం అంతా విషాదంలో ఉన్నా అల్లు రామలింగయ్య గారు షూటింగ్ కి వెళ్లి ప్రేక్షకులను నవ్వించారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.