మెగాస్టార్ చిరంజీవి హార్డ్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో కొణిదెల శివ శంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. రాత్రి, పగలు అని చూడకుండా సినిమానే ప్రాణంగా భావించి ఆయన కష్టపడ్డారు కాబట్టే నేడు మెగాస్టార్ గా కొలువుండిపోయారు. కొన్నిసార్లు ఆయన పడిన కష్టం ఆయన నోటివెంట వింటుంటే కళ్ళు చెమర్చక మానవు. ఇప్పుడున్న హీరోలు కొద్దిగా కాలు నొప్పి ఉంటేనే షూటింగ్ కు పదిరోజులు సెలవు…