Chiranjeevi : సినిమా అంటేనే ఎంటర్ టైన్ మెంట్. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి కాసేపు నవ్వుకుంటేనే అది సినిమా. కానీ ఇప్పుడు పంథా మారిపోయింది. మాస్, యాక్షన్ ఉంటేనే సినిమా అంటున్నారు. కానీ కామెడీ సినిమాలకు ఒకప్పుడు చిరంజీవి మంచి బ్రాండ్ గా ఉండేవారు. ఆయన కామెడీ పండించడంలో మేటి. కానీ రీ ఎంట్రీ తర్వాత ఆయన నుంచి సరైన కామెడీ సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఒకప్పుడు కామెడీకే తన సినిమాల్లో సింహభాగం కేటాయించిన చిరంజీవి.. ఇప్పుడు అసలు కామెడీనే లేకుండా తీయడం ఒకింత లోటుగా అనిపిస్తోంది.
Read Also : Kannappa : పిలక, గిలక పాత్రలపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు..
ఆయనలోని కామెడీ యాంగిల్ ను వాడుకునే డైరెక్టర్లు కూడా ఇప్పటి వరకు రాలేదు. అందుకే ఇప్పుడు అనిల్ రావిపూడితో కామెడీ లోటును తీర్చేందుకు సినిమా చేస్తున్నారు. కుటుంబమంతా కడుపుబ్బా నవ్వుకునేలా కామెడీ సినిమా చేయాలని మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకే అనిల్ కు అవకాశం ఇచ్చారని సమాచారం. వెంకటేశ్ తో అనిల్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ భారీ హిట్ అయింది.
కామెడీతో కూడా భారీ వసూళ్లు సాధించొచ్చని నిరూపించింది ఆ మూవీ. అందుకే ఇప్పుడు చిరు కూడా అలాంటి ప్రయోగమే చేయబోతున్నారంట. పూర్తి కామెడీ బేస్ తోనే మూవీ చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా చిరంజీవి మళ్లీ ఇలాంటి సినిమా తీసి ఓ ట్రెండ్ సెట్ చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.
Read Also : ZEE 5 : కొత్త బ్రాండ్ ఐడెంటిటీతో వస్తున్న జీ5..