మారుతి, గోపీచంద్ కాంబోలో రూపొందిన ‘పక్కా కమర్షియల్’ సినిమా జులై 1వ తేదీన విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను భారీఎత్తున హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన అడుగుపెట్టడమే ఆలస్యం.. వేదిక మొత్తం ఈలలు, అరుపులతో హోరెత్తిపోయింది. వేదికలో ఉన్న అభిమానులు మొత్తం ‘మెగాస్టార్’ అంటూ కేకలు వేశారు. కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎప్పట్లాగే యాంకర్ సుమ తనదైన శైలిలో చిరుని స్వాగతం పలికారు. అప్పటికే జోష్ లో ఉన్న ఫ్యాన్స్.. సుమ ఇచ్చిన ఎలివేషన్స్ తో మరింత రెచ్చిపోయారు.