Chiranjeevi: గ్రామీ అవార్డుల్లో భారత్‍కు పురస్కారాల పంట.. కంగ్రాట్స్ చెప్పిన చిరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈ మధ్యనే జరిగిన విషయం తెల్సిందే. ఈసారి మీ అవార్డుల్లో భారత్‍కు పురస్కారాల పంట పండింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఐదుగురు సంగీత కళాకారులను గ్రామీ అవార్డు వరించింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీలు వరించాయి. శంకర్ మహదేవన్, ఉస్తాద్ జాకీర్ హుసేన్ ఉన్న భారత్‍కు చెందిన శక్తి మ్యూజికల్ బ్యాండ్‍కు బెస్ట్ గ్లోబల్ ఆల్బమ్ అవార్డు వచ్చింది. ఇక దీంతో సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్షలు వెల్లువలా విరిశాయి. తాజాగా చిరంజీవి.. గ్రామీ అవార్డులకు శుభకాంక్షలు తెలిపారు. లేట్ గా చెప్పినా కూడా ఎంతో మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
“గ్రామీల వద్ద భారత జెండా ఎత్తుగా ఎగురుతుంది. పార్టీలో చేరడం కాస్త ఆలస్యం అయ్యింది. గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్న అద్భుతమైన టీమ్ శక్తికి హృదయపూర్వక అభినందనలు. జాకీర్ తబ్లా ఉస్తాద్ కు, శంకర్ మహదేవన్ కు, సెల్వగణేష్, గణేష్ రాజగోపాలన్ ఈ ఏడాది గ్రామీలలో అద్భుతమైన మూమెంట్ గా చేశారు. శంకర్ మహదేవన్ తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉన్నందుకు ఆనందంగా ఉంది. అతను నా కోసం పాడిన కొన్ని అద్భుతమైన పాటలను పాడారు. మీరు మా అందరికీ గర్వకారణం మరియు మీ అద్భుతమైన విజయాలు మిలియన్ల మంది భారతీయులకు స్ఫూర్తినిస్తాయి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
The Indian flag 🇮🇳 flies high at the #GRAMMYs
Joining the party a bit late, but
Hearty Congrats to the amazing Team #Shakti for winning the ‘Global Music Album of the year’!Kudos to Ustad @ZakirHtabla , @Shankar_Live #SelvaGanesh , #GaneshRajagopalan for seizing
‘This…— Chiranjeevi Konidela (@KChiruTweets) February 8, 2024
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!