Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki Sequel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ – ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauji) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రాబోతున్న ‘స్పిరిట్’ కూడా రిలీజ్‌కు లైన్లో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. అయితే వీటితో పాటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి రాబోయే సీక్వెల్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. ‘కల్కి’ సీక్వెల్ కోసం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులు ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేయగా .. ఈ సినిమాలో సుమతి పాత్ర పోషించిన దీపికా పదుకొణె ప్లేస్‌లో పార్ట్-2 లో ఎవరు నటించబోతున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ రేసులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ పేరు గట్టిగా వినిపిస్తోంది. దీనికి తోడు తాజాగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్పెషల్ పోస్ట్ ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆలియా భట్, శర్వరీ వాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఆల్ఫా’ జూలై 3న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. “ఆల్ఫా ట్రైలర్ అమేజింగ్‌గా ఉంది. ఆలియా భట్, వైఆర్ఎఫ్ (YRF) టీమ్ మొత్తానికి నా బెస్ట్ విషెస్” అంటూ రాసుకొచ్చారు. దీనికి ఆలియా భట్ కూడా అంతే ఎగ్జైటింగ్‌గా రిప్లై ఇస్తూ.. “థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ సో మచ్ ప్రభాస్” అంటూ ఆ స్టోరీని రీ-షేర్ చేసింది. సాధారణంగా ప్రభాస్ ఇతర బాలీవుడ్ సినిమాల గురించి ఇంత పర్సనల్‌గా పోస్ట్‌లు పెట్టరని, ‘కల్కి 2’ లో ఆలియా ఎంట్రీ ఉండబట్టే ఈ రేంజ్ ప్రమోషన్ చేస్తున్నారంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ అప్పుడే క్రేజీ డీకోడింగ్ మొదలుపెట్టేశారు. నిజానికి ఆలియా భట్ ‘కల్కి’ సీక్వెల్లో భాగం కావడం లేదని గతంలోనే మేకర్స్ ఒకసారి హింట్ ఇచ్చారు. కానీ పార్ట్-1 లో నటించిన దీపికా పదుకొణె ప్లేస్‌ను రిప్లేస్ చేయడం అంత సులువైన విషయం కాదు కాబట్టి, మేకర్స్ చివరి నిమిషంలో ఆలియాను తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. ఈ వైరల్ పోస్ట్‌పై అటు ప్రభాస్ టీమ్ కానీ, ఇటు ఆలియా కానీ ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మరి ‘కల్కి 2’ లో సుమతిగా ఆలియా కనిపిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!