Chiranjeevi-Balakrishna : మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ వస్తోంది. నేడు చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా నేడు టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ చేశారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఈ రోజు చిరంజీవి గారినే డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆయన మొదటి షాట్ ను మానిటర్ లో చూసినప్పుడు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ఇందులో చిరంజీవి, వెంకటేశ్ గారిని చూపించే అవకాశాలు కలిగింది అంటూ తెలిపారు అనిల్. దీంతో చిరంజీవి, బాలకృష్ణ కాంబోలో సినిమా ఎప్పుడు అని రిపోర్టర్లు ప్రశ్నించారు.
Read Also : Hero Dharma : బిగ్ బాస్ ఆర్టిస్టులతో హీరో అక్రమ సంబంధాలు.. భార్య ఆరోపణలు
అనిల్ స్పందిస్తూ.. ‘గతంలో చిరంజీవి గారు కూడా బాలకృష్ణతో నటించేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. కానీ సరైన కథ దొరకాలి కదా. ఎందుకంటే ఇద్దరి స్టార్ డమ్ వేరే, మ్యానరిజం, ఫ్యాన్ బేస్ వేరే. ఇద్దరికి సరిపోయే కథ దొరికినప్పుడు కచ్చితంగా సినిమా తీస్తా. దానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం చిరంజీవి, వెంకటేశ్ తో చేసే అవకాశం దక్కింది అంటూ తెలిపాడు అనిల్ రావిపూడి. కుదిరితే ప్రతి ఏడాది సంక్రాంతికే తన సినిమాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. ఈ సినిమాలో మాస్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఉన్నాయని తెలిపాడు. వింటేజ్ మెగాస్టార్ ను ఇందులో చూపించబోతున్నట్టు తెలిపాడు. చిరంజీవి ఎంతో కష్టపడి తన లుక్స్ ను మార్చుకున్నాడని.. అందుకు తగ్గట్టే మేం కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారని తెలిపాడు.
Read Also : Megastar Chiranjeevi : చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా..?