Charmy Kaur: ఇది చిన్న బ్రేక్ మాత్రమే.. ముందుంది మొసళ్ల పండగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charmy Kaur Reacts On Jana Gana Mana Rumours: నిన్న రాత్రి నుంచి పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’ సినిమాను రద్దు చేశారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం వల్ల భారీ నష్టాలు మిగిలినందుకే, మేకర్స్ ఆ సినిమా షూటింగ్ ఆపేయాలని నిర్ణయించుకున్నారని వార్తలొస్తున్నాయి. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీ, విజయ్ సహా నిర్మాతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారని.. చివరికి బడ్జెట్ సరిపోదన్న లెక్కలు చూసుకున్నాక, ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేయాలని డిసైడ్ అయ్యారని పుకార్లు షికారు చేశాయి.
ఈ వార్తలపై మాజీ నటి, నిర్మాత చార్మీ స్పందించింది. నేరుగా జన గణ మన సినిమాపై వస్తున్న వార్తల మీద రియాక్ట్ అవ్వలేదు.. జస్ట్ చిల్ గాయ్స్ అంటూ రూమర్స్‌ని నమ్మొద్దని పరోక్షంగా చెప్పింది. ప్రస్తుతానికి తాము చిన్న విరామం తీసుకుంటున్నామని తెలిపింది. అయితే, దాని పక్కనే బ్రాకెట్‌లో ‘సోషల్ మీడియా నుంచి’ అని మెన్షన్ చేసి, కాస్త తికమక పెట్టింది. ‘పూరీ కనెక్ట్స్’ తప్పకుండా బౌన్స్ బ్యాక్ ఇస్తుందని.. ముందుంది మొసళ్ల పండగ అన్నట్టు, ఈసారి అంతకుమించిన కంటెంట్‌తో ముందుకు వస్తామని తెలిపింది. అప్పటివరకూ ఎవరి పనులు వాళ్లు చూసుకుంటే బెటర్ అన్నట్టుగా చార్మీ ట్వీట్ చేసింది. అయితే.. ఈ ట్వీట్ చాలా గందరగోళంగా ఉండటంతో, చార్మీ ఏం చెప్పాలనుకుందో స్పష్టత లేకుండా పోయింది. కానీ, జన గణ మన మీద రూమర్స్ వస్తున్న సమయంలోనే రియాక్ట్ అయ్యింది కాబట్టి, ఆ సినిమా ఆగిపోలేదన్న సంకేతాలు ఇచ్చినట్టుంది. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజుల వరకు ఆగాల్సిందే!
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
కాగా.. ఇంకా లైగర్ విడుదల కాకముందే ఈ ఏడాది మార్చి చివర్లో ‘జన గణ మన’ సినిమాను అనౌన్స్ చేశారు. ఆ మరుసటి రోజు ప్రెస్‌మీట్ నిర్వహించి, సినిమా విశేషాల్ని వెల్లడించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు.. లైగర్ చిత్రాన్ని రిలీజ్ కాకముందే జూన్ 4వ తేదీన షూటింగ్ ప్రారంభించి, ఒక షెడ్యూల్‌ని కూడా పూర్తి చేశారు.
Chill guys!
Just taking a break
( from social media )@PuriConnects will bounce back 😊
Bigger and Better…
until then,
Live and let Live ❤️— Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!