Charan Raj Intresting comments on Narakasura Movie: పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన నరకాసుర సినిమాలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించగా కొత్త దర్శకుడు సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన చరణ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలు పంచుకునాన్రు. ప్రతిఘటన, జెంటిల్ మేన్ సినిమాలు నటుడిగా నన్ను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయని పేర్కొన్న ఆయన వివిధ భాషల్లో దాదాపు 600 చిత్రాల్లో నటించానని, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చానని అన్నారు. సినిమాల్లో నటించాలనే ప్యాషన్ ఉండేది అందుకే 8 ఏళ్లు అర్థాకలితో కష్టపడ్డా అయితే ఆ కష్టానికి ఫలితంగా 40 ఏళ్ల కెరీర్ దక్కిందని అన్నారు.
Thaman: చచ్చిన శవాన్ని బతికించాలంటున్నారు.. డైరెక్టర్లపై థమన్ షాకింగ్ కామెంట్స్
నటుడిగా డబ్బు కంటే నాకు సంతృప్తినే కోరుకుంటున్నా, మంచి క్యారెక్టర్ ఉంటే డబ్బు ఇవ్వకున్నా నటిస్తానని ఆయన అన్నారు. నరకాసుర కథను డైరెక్టర్ సెబాస్టియన్ చెప్పినప్పుడు ఈ కథ, కథనాల్లోని కొత్తదనం బాగా ఆకట్టుకున్నాయని అందుకే సినిమాలు వద్దనుకుని వదిలేసే నేను వెంటపడి మరీ ఈ సినిమా చేస్తానని చెప్పానని అన్నారు. కథ చెప్పిన తరువాత ఫోన్ కలవలేదని, స్విచ్ ఆఫ్ చేశాడని అనుకుని రెండు నెలలు ఎదురు చూస్తే ఆ విషయం తరువాత బయటకి వచ్చిందని చెప్పుకొచ్చారు.. . డైరెక్టర్ గా ఈ సినిమాను ఒక న్యూ అప్రోచ్ తో తెరకెక్కించారని ఆడియెన్స్ కు కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మూవీ అవుతుందని థియేటర్స్ లో సినిమా చూస్తే ఇది నిజమని అర్థమవుతుందని అన్నారు.