Thaman Sensational Comments on Directors: ప్రస్తుతానికి టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే కచ్చితంగా ముందుగా వినిపించే పేర్లలో థమన్ పేరు కూడా ఒకటి.. ప్రస్తుతానికి ఆయన హపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నాడు. దాదాపుగా ఏడాదికి పెద్ద హీరోలతోనే ఏడు -ఎనిమిది సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అలాంటి థమన్ సాధారణంగా కాపీ ట్యూన్ చేసి వార్తల్లోకి వస్తూ ఉంటాడు కానీ ఈసారి దర్శకుల మీద చేసిన వ్యాఖ్యల కారణంగా వార్తల్లోకి వచ్చాడు. తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో జరిగిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు, వాస్తవానికి ఈ సినిమాలో మూడే పాటలు ఉన్నాయి. నాలుగో పాటను యాడ్ చేశారు కూడా. అయితే వాటిలో ఒకటి రెండు పాటలకు మంచి క్రేజ్ వచ్చింది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి పేర్కొచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. డైరెక్టర్ బాబి యాంకర్ గా మారి సినిమా యూనిట్ని ఇంటర్వ్యూ చేయగా ఆ ఇంటర్వ్యూలో థమన్ కూడా పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు ఆ ఇంటర్వ్యూ లోనే దర్శకుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bigg Boss7 Telugu : ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. పూజా మూర్తి షాకింగ్ కామెంట్స్..
ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ సినిమా చూసిన వారందరూ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాలేదని సినిమాకి నెగిటివ్ అనిపిస్తుందని వెంటనే అనేస్తారని కానీ ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేసింది దర్శకుడే అనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చారు. మంచి సంగీతం అందించాలంటే దానికి తగినట్లుగా సాలిడ్ ఎమోషన్స్ ఉండేలాగా సీన్లు రాసుకోవాలని ఈ సందర్భంగా థమన్ వెల్లడించాడు. ఎమోషన్లు గానీ సీన్స్ గానీ బాగోనప్పుడు ఎంత మంచి సంగీతం అందించినా సీన్ పండదని ఆయన అన్నాడు. దర్శకులు స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న సీన్లు పెడితే అప్పుడు తన మ్యూజిక్ వర్క్ అవుట్ అవుతుందని ఆయన అన్నారు.. భగవంత్ కేసరి విషయానికి వస్తే అనిల్ రావిపూడి మంచి ఎమోషన్స్ ఇచ్చాడు కాబట్టి తన మ్యూజిక్ తోడై సినిమా మంచి హిట్ అయిందని అఖండ సినిమా విషయంలో అలాగే ఇతర సినిమాల విషయాల్లో కూడా అవి సక్సెస్ అయ్యాయి కాబట్టే మ్యూజిక్ కూడా హిట్ అయింది అని చెప్పుకొచ్చారు. సీన్ లో కనుక ఆత్మ లేకపోతే మ్యూజిక్ వర్కౌట్ అవ్వదని థమన్ అన్నాడు. అంతేకాదు సీన్ బాగుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తా, కానీ అసలు ఎమోషన్ లేకపోతే ఎంత కొట్టినా వేస్టే, చచ్చిన శవాన్ని తెచ్చి బతికించమంటే ఎలా అవుతుంది? అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.