Chandrika Ravi Becomes The First Indian Actress To Host A Radio Show In The US:
‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ అనే తమిళ సినిమాతో తన నటనతో , పాటు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన చంద్రికా రవి ఇప్పుడు తన సినీ కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్ళింది. భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి షో అనే అమెరికన్ రేడియో టాక్ షోను హోస్ట్ చేయడానికి సిద్ధం అయింది. చంద్రిక ఆమె తన గుర్తింపు కోసం ఎలా పోరాడుతుందో తెలుసుకుని రుకుస్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్ ఆమెకు ఒక ఆఫర్ అందించారు. తన జీవిత అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడానికి రేడియో ఒక గొప్ప వేదిక కాబట్టి తనకు అందించిన ఈ అవకాశం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది. రేడియో టాక్ షోకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న చంద్రిక ఈ కార్యక్రమం యుఎస్‌లోని అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన ఐహార్ట్ రేడియోలో విడుదలవుతోందని వెల్లడించింది.
Aswani Dutt: అశ్వనిదత్ కి టీటీడీ చైర్మన్ పదవి?
ఇది ఒక గొప్ప అనుభవం. కొంచెం ఒత్తిడి, కానీ లాభదాయకం. “కెమెరా వెనుక” ఉండటం తరువాత ఇది నాకు భిన్నమైన అనుభవం, ప్రజలు నిజమైన నన్ను ఇప్పుడు వినగలరు అని పేర్కొంది. సినీ కెరీర్‌కు ముందు; చంద్రిక రేడియోలో మరియు టెలివిజన్‌లో అనేక లైవ్ షోలను హోస్ట్ చేసింది. అయితే USలో రేడియో షోను హోస్ట్ చేసిన మొదటి భారతీయ నటిగా ఆమె నిలవనుంది. “నేను మొదటివాడిని కావచ్చు, కానీ నేను చివరివాడిని కాను,” అని ఆమె కామెంట్ చేసింది. చంద్రిక షో USలోని అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన iHeart రేడియో మరియు రుకస్ అవెన్యూ రేడియోలో ప్రతి గురువారం, భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు ప్రసారం చేయబడుతుంది. పూర్తి ఎపిసోడ్ ప్రతి శుక్రవారం యూట్యూబ్‌లో అంతర్జాతీయంగా అందరి కోసం విడుదల చేయబడుతుందని ఆమె పేర్కొంది.