నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతోంది.
నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు చందూ మొండేటి. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టి తన ప్రతిభను చాటుకున్నాడు. తర్వాత నాగచైతన్యతో ‘ప్రేమమ్’ మూవీ తెలుగులో రిమెక్ చేశాడు అది ఓ మోస్తరు విజయాన్ని సాధిస్తే.. ‘సవ్యసాచి’ మాత్రం డిజాస్టర్ అయింది. దీంతో చందూ టాలెంట్ పై విమర్శలు వచ్చాయి. కానీ ‘కార్తికేయ’ సీక్వెల్ తో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడు చందూ. ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్…
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఐదారు సినిమాల్లో నటిస్తున్నాడు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే… చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న ‘కార్తికేయ -2’ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు నిర్మాతలు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ సక్సెస్ ను సొంతం చేసుకుంటున్న క్రేజీ ప్రొడక్షన్ హౌసెస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ…