Celebrating Venky 75 with Never Before Event in the History of Telugu Cinema on 27th December: విక్టరీ వెంకటేశ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం సైంధవ్, హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తోంది సైంధవ్ టీం. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ వెంకటేశ్ కు 75వ సినిమా కావడంతో పాటు హిట్ సిరీస్ తో రెండు హిట్లు చేసిన శైలేష్ కొలను దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు. చంద్రప్రస్థ అనే ఒక ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్ మిషన్ నేపథ్యంలో సాగే సైంధవ్‌లో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది.
Guntur Kaaram: స్పైసీ సాంగ్.. మహేష్, శ్రీలీల చితక్కొట్టేశారు అంతే!
ఈ సినిమా ద్వారా బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు కీలకపాత్రల్లో నటిస్తుండగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక వెంకటేశ్ 75 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఫంక్షన్ ఒకటి చేయబోతున్నట్టు తెలుస్తోంది. 27న సాయంత్రం జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుక జరగనుంది. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ హాజరవుతారని,. 75 సినిమాల నిర్మాతలు, దర్ళకులు.. ఇంకా చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. ఈటీవీ విన్ లో ఈ సెలబ్రేషన్స్ స్ట్రీమ్ కానున్నాయి అని అంటున్నారు.