లోకనాయకుడు కమల్ హాసన్, తాను 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగలను అంటే కోలీవుడ్ లో ప్రతి సినీ మేధావి నవ్విన రోజులు ఉన్నాయి. హిట్టే లేదు కానీ 400 కోట్లు రాబడుతాడంట అంటూ కామెంట్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ వెకిలి నవ్వులని, నిరాశ పరిచే కామెంట్స్ ని పట్టించుకోకుండా కమల్ హాసన్, లోకేష్ కనగారాజ్ తో కలిసి ‘విక్రమ్’ సినిమా చేశాడు. హిట్ అవుతుందిలే అనుకున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో ప్రేక్షకులని ఆకట్టుకుంది. కమల్ హాసన్ చెప్పినట్లే 400 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలని, సినీ అభిమానులు ఆశ్చర్య పరిచాడు. ఈ యాక్షన్ ఎక్స్ట్రావెంజా సినిమాలో కమల్ హాసన్ వింటేజ్ వైబ్స్ ని క్రియేట్ చేసి అభిమానులని ఎంటర్టైన్ చేశాడు. ఇప్పుడు చిరు పరిస్థితి ఒకప్పటి కమల్ హాసన్ లాగే ఉంది. సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడం, ఎప్పుడూ లేనిది కొందరు చిరు లుక్స్ ని ట్రోల్ చేస్తుండడం లాంటి విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి.
సింపుల్ గా చెప్పాలి అంటే చిరు లిటరల్ గా ఆయన కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత నెగటివిటిని ఫేస్ చేస్తున్నాడు. ఈ నెగిటివిటికి ఎండ్ కార్డ్ పడాలి అంటే చిరు కంబ్యాక్ ఇవ్వాల్సిందే. హిట్ కొడితే సరిపోదు చిరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీ ఇవ్వాలి అప్పుడే విమర్శలకి చెక్ చెప్పినట్లు అవుతుంది. కమల్ హాసన్ ఎలా అయితే ‘విక్రమ్’ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడో, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో చిరు కూడా అలానే కంబ్యాక్ ఇస్తాడని మెగా అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రోజు రోజుకీ అంచనాలు పెంచుతున్న వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసిన ‘వీరయ్య టైటిల్ సాంగ్’ చూస్తుంటే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ‘విక్రమ్’ అయ్యేలాగే ఉంది. చిరుని వింటేజ్ లుక్స్ లో చూపించడానికి బాబీ ట్రై చేస్తున్నాడు, అది వర్కౌట్ అయితే చాలు చిరు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినట్లే. పోస్టర్స్ అండ్ సాంగ్స్ లో చిరుని చూస్తే, ఈ మధ్య కాలంలో ఇంత మాస్ రోల్ లో ఆయన కనిపించలేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. విక్రమ్ సినిమాలో ఫాహాద్ ఫజిల్ నటించినట్లే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మాస్ మహారాజ రవితేజ పోలిస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అక్కడ విజయ్ సేతుపతి నెగటివ్ రోల్ ప్లే చేసినట్లే, ఇక్కడ ‘బాబీ సింహా’ నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ‘విక్రమ్’ సినిమాని కమల్ హాసన్ ఫ్యాన్ అయిన ‘లోకేష్ కనగారాజ్’ డైరెక్ట్ చేస్తే, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని చిరు ఫ్యాన్ అయిన ‘బాబీ’ డైరెక్ట్ చేస్తున్నాడు. మరి విక్రమ్ సినిమాతో ఇన్ని సిమిలారిటీస్ ఉన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చిరుకి మరో ‘విక్రమ్’ అవుతుందేమో చూడాలి.