Sreeleela : శ్రీలీల ఎంతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది. మహేశ్ బాబు లాంటి అగ్ర హీరో సినిమాలో కనిపించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కానీ ఏం లాభం.. ఎంత పెద్ద సినిమాలు చేసినా ఆమెకు ఒక్క హిట్లు నాలుగు ప్లాపులు అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఒకే ఏడాది ఎనిమిది సినిమాల్లో కనిపించినా లాభం లేకుండా పోయింది. దాంతో ఆమె పని అయిపోయిందనుకున్నారు. కానీ పుష్ప-2లో ఐటెం సాంగ్ చేసి మళ్లీ ఛాన్సులు దక్కించుకుంటోంది. కానీ ఆమె చేతిలో ఇప్పుడు రెండే పెద్ద సినిమాలు ఉన్నాయి.
Read Also : Sai Durga Tej : తెలుగులో స్టైలిష్ హీరో అతనే.. సాయిదుర్గ తేజ్ కామెంట్స్
మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర ఒకటి రెండోది పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఆమె ఆశలన్నీ ఉస్తాద్ మీదనే ఉన్నాయి. మాస్ జాతర హిట్ అయినా ప్లాప్ అయినా ఆమె కెరీర్ కు పెద్దగా ఒరిగేది ఉండదు. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ సినిమాలో బ్యూటిఫుల్ రోల్ చేస్తోంది. ఈ సినిమాతో ఒక్క హిట్ పడితే చాలు ఆమె కెరీర్ తిరిగిపోతుందని ఆశలు పెంచుకుంటోంది. పవన్ కల్యాణ్ సినిమాకు హిట్ టాక్ వస్తే క్రేజ్ మామూలుగా ఉండదు. దెబ్బకు హీరోయిన్లు టాప్ లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు శ్రీలీల కూడా తన కెరీర్ కు ఉస్తాద్ బూస్ట్ అవుతుందని ఆశపడుతోంది. ఇది హిట్ అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్లాపుల డ్యామేజ్ అంతా కొట్టుకుపోతుంది. మళ్లీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయి. మరి శ్రీలీలను ఉస్తాద్ నిలబెడుతాడా లేదా అన్నది చూడాలి.
Read Also : Kiara : నువ్వు నా ప్రపంచానే మార్చేశావ్.. కియారా పోస్ట్ వైరల్
