‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి ‘హిట్ 2’ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీ క్లైమాక్స్ లో ‘హిట్ 3’ హీరోని చూపిస్తామని ప్రమోషన్స్ లో చెప్పిన చిత్ర యూనిట్, ‘హిట్ 3’లో ‘నాని’ హీరోగా ఉంటాడు అని రివీల్ చేశారు. ‘హిట్ 2’ క్లైమాక్స్ లో వచ్చిన ఈ సీన్, నాని ఫాన్స్ లో జోష్ నింపింది. ఈ ఊహించని సర్ప్రైజ్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయాలనుకున్న చిత్ర యూనిట్ కి షాక్ ఇస్తూ, ఫస్ట్ డే మార్నింగ్ షో అవగానే ‘హిట్ 3’ హీరో ‘నాని’ అంటూ సోషల్ మీడియాలో లీక్ చేసేశారు. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ పూర్తవ్వగానే నాని ‘హిట్ 3’ మొదలుపెట్టే అవకాశం ఉంది. ‘దసరా’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న నాని, ‘హిట్ 3’తో ఆ పాన్ ఇండియా స్ట్రీక్ ని కంటిన్యు చేయాలంటే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాలి.
నాని ‘హిట్ 3’లో నటించడం అనేది సర్ప్రైజ్ ఎలిమెంటే కానీ నానికి ఇదో సవాల్ అనే చెప్పాలి. బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉన్న నాని ఇప్పటివరకూ సీరియస్ సినిమాలు చేసి మెప్పించింది చాలా తక్కువ. ‘జెంటిల్ మెన్’ సినిమా మినహా మిగిలిన ‘జెండాపై కపిరాజు’, ‘పైసా’, ‘కృష్ణార్జున యుద్ధం’ లాంటి సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. సీరియస్ సినిమాలే కాదు నాని గవర్నమెంట్ ఆఫీసర్ గా చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర చతికల పడ్డాయి. ఆర్మీ ఆఫీసర్ గా నాని నటించిన ‘వి’ సినిమా, ‘ఎమ్మార్వో’ గా నాని నటించిన ‘టక్ జగదీశ్’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి సమయంలో నాని ‘హిట్ 3’లో పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. పైగా ‘హిట్ 1’తో పోల్చుకుంటే ‘హిట్ 2’లో పెద్దగా విషయం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. థ్రిల్లర్ సినిమాల్లో మర్డర్స్ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది, పోలిస్ దాని సాల్వ్ చేస్తాడు. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా ‘లైన్’ మాత్రం ఇదే ఉంటుంది. రెండో సినిమాకే మొనాటమీ వచ్చేసింది అని కామెంట్స్ వినిపిస్తున్న నేపధ్యంలో ‘పార్ట్ 3’లో ఆడియన్స్ ఊహించలేని కథనం చూపించాల్సి ఉంది. ముందు వచ్చిన రెండు పార్ట్స్ కన్నా కొత్తగా తెరకెక్కితేనే ‘హిట్ 3’ హిట్ అవుతుంది.