13 ఏళ్ల క్రితం విడుదలైన ‘అవతార్’ చిత్రం అప్పట్లో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. జేమ్స్ కెమరూన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ తాజాగా రీరిలీజ్ అయ్యి హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టింది. అవతార్ సినిమా రీరిలీజ్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా 285 మిలియన్ డాలర్లు వసూలు చేయడం చూసి అందరికీ మతిపోతోంది. ఇండియాలో కూడా కొన్ని సెంటర్స్ లో అవతార్ సినిమా రీరిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. నిజానికి అవతార్ సినిమాని రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా రిలీజ్ చేయలేదు, ఈ మూవీ రీరిలీజ్ చేయడానికి ఏకైక కారణం, డిసెంబర్ 16న అవతార్ 2 విడుదలవ్వడానికి సిద్దంగా ఉండడమే.
అవతార్ 2 సినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది, బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా… ఆడియన్స్ ని ఒక కొత్త అండర్ వాటర్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా అవతార్ 2 ఉండబోతోంది. ఆ మూవీ రిలీజ్ లోపు, ఆడియన్స్ కి అవతార్ సినిమా, ఆ సినిమా స్టాండర్డ్స్ ని ఆడియన్స్ ని గుర్తు చేయడానికే మేకర్స్ ఈ ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యి అవతార్ సినిమా సెన్సేషనల్ నంబర్స్ కి రాబట్టడమే కాకుండా అవతార్ 2 కోసం ఆడియన్స్ ని ప్రిపేర్ చేసింది. ఆ తర్వాత రిలీజ్ అయిన అవతార్ 2 ట్రైలర్స్ సినిమాపై ఉన్న అంచనాలని మరింత పెంచాయి. అవతార్ 2 బ్రేక్ ఈవెన్ కావాలి అంటే దాదాపు 2 బిలియన్ డాలర్స్ రాబట్టాల్సి ఉంది. 2 బిలయన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో రఫ్ గా ఒక 16000 కోట్లు, ఇంత మొత్తం రాబట్టడం అంటే మాటలు కాదు. అయితే ప్రస్తుతం అవుతున్న ప్రీబుకింగ్స్ చూస్తుంటే, ఆ మార్క్ రీచ్ అవ్వడం అవతార్ 2 సినిమాకి పెద్ద కష్టంగా కనిపించట్లేదు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న అవతార్ 2 సినిమా అవలీలగా బెంచ్ మార్క్ ని రీచ్ అయ్యి కలెక్షన్స్ లో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయడానికి సిద్ధంగా ఉంది.