బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్టిన్ లూథర్ కింగ్’.రాజకీయాలపై సెటైరికల్ కామెడీ మూవీగా ఈ చిత్రం రూపొందింది.తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన మండేలా మూవీ కి రీమేక్‍గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మండేలా సినిమాలో యోగిబాబు పోషించిన పాత్రను మార్టిన్ లూథర్ కింగ్‍లో సంపూర్ణేశ్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. యంగ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా స్క్రీన్‍ప్లే మరియు డైలాగ్‍లు అందింటంతో పాటు కీలక పాత్ర…
‘హృదయ కాలేయం’తో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు ఇప్పటి వరకూ 12 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. అందులో ఏడవ చిత్రం ‘ధగడ్ సాంబ’. ఇది ఈ నెల 20న జనం ముందుకు వస్తోంది. సోనాక్షి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎన్. ఆర్. రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.బి.హెచ్. శ్రీనుకుమార్ రాజు నిర్మించాడు. తన గత చిత్రాలకు భిన్నంగా ఎంటర్ టైన్ మెంట్ తో ఇందులో హారర్ టచ్ కూడా ఉందని…
టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మంగళవారం రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించాడు. సంపూ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్యాలీఫ్లవర్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కాకినాడ, రాజమండ్రిలో చిత్ర యూనిట్ నిర్వహించింది. దీంతో బర్నింగ్ స్టార్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అభిమానులు సంపూర్ణేష్‌కు ఘన స్వాగతం పలికారు. పలువురు అభిమానులు సంపూ ఫేస్ మాస్కులు ధరించి సర్‌ప్రైజ్ చేశారు. Read Also: బుల్లితెరపై ఐకాన్ స్టార్ సందడి.. తగ్గేదే లే..!! ఈ కార్యక్రమం అనంతరం…
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, వాసంతి జంటగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అంది ట్యాగ్ లైన్. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 26 న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. జంతువుకైనా మనుషులకైనా ఒకే భార్య ఒకే భర్త అనే సిద్ధాంతంతో ఉండే గ్రామ పెద్ద ‘క్యాలీఫ్లవర్’.. అనుకోకుండా తన…
‘హృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ వంటి చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “క్యాలీఫ్లవర్”. “శీలో రక్షతి రక్షితః” అనే ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తుండగా, ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గూడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీప్ ప్రజ్వల్…
(మే 9న సంపూర్ణేశ్ బాబు బర్త్ డే)సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందరి దృష్టినీ ఆకర్షించి, సినిమాలపై సెటైర్ వేస్తూనే సినిమాల్లో అడుగుపెట్టిన ధీరుడు సంపూర్ణేశ్ బాబు. ఆయన తొలి చిత్రం ‘హృదయ కాలేయం’ టైటిల్ లోనే వైవిధ్యం చూపింది. ఇక మన తెలుగు సినిమాల్లోని స్టార్ హీరోల చిత్రాల్లోని జిమ్మిక్స్ నే ఆ చిత్రంలో వ్యంగ్యంగా చిత్రీకరించి, జనాన్ని ఆకట్టుకున్నాడు సంపూర్ణేశ్. జనం అభిమానంగా ‘సంపూ’ అని పిలుచుకుంటున్న ఈ బాబుకు ఉన్న క్రేజ్ తో…