Buchi Babu Sana Clarity On Being Part Of Pushpa2 Story Discussions: రీసెంట్‌గా సుకుమార్‌తో కలిసి బుచ్చిబాబు సానా ఏదో డిస్కషన్స్ చేస్తోన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప: ద రూల్’ సినిమా స్క్రిప్టుకి బుచ్చిబాబు సహకారం అందిస్తున్నాడనే వార్తలు తెరమీదకొచ్చాయి. చాలాకాలం నుంచి స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దే పనుల్లో ఉన్న సుకుమార్.. ఈ క్రమంలోనే తన శిష్యుడైన బుచ్చిబాబుని రంగంలోకి దింపి, అతని సహకారం తీసుకుంటున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు. తన తదుపరి సినిమా కథ కోసం సుకుమారే సహకారం అందిస్తున్నారని స్పష్టం చేశాడు.
వైరల్ అయిన ఆ ఫోటోని షేర్ చేస్తూ.. ‘‘ఈ ఫోటో నేను చేయబోయే తదుపరి సినిమా కథ డిస్కషన్స్ సందర్భంలోనిది. మా గురువు సుకుమార్ సార్ నా కోసం, నా సినిమా కథ కోసం సహాయం చేయడానికి వచ్చారు. ఆయన సినిమా కథలో కూర్చొని డిస్కషన్ చేసేంత స్థాయి నాకు లేదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప, ఆయనకి ఇచ్చేంత లేదు’’ అని బుచ్చిబాబు ట్వీట్ చేశాడు. ఫోటో విషయంపై స్పష్టతనైతే ఇచ్చాడు కానీ, తన నెక్ట్స్ సినిమా ఏంటన్నదే బుచ్చిబాబు క్లారిటీ ఇవ్వలేదు. జూ. ఎన్టీఆర్‌తో ఉంటుందని ప్రచారమైతే జరుగుతోంది కానీ, అది ఇంకా అధికారికంగా కన్ఫమ్ అవ్వలేదు. అయితే.. స్క్రిప్టులో సహకారం అందించేందుకు స్వయంగా సుకుమార్ రంగంలోకి దిగాడంటే, ఇది కచ్ఛితంగా తారక్ సినిమానే అయ్యుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ photo నేను తరువాత చేయబోయే నాసినిమాకథ Discussion సందర్భంలోది మాగురువుగారు@aryasukku సుకుమార్ Sir నా కోసం నా సినిమా కథ కోసం Help చేయడానికి వచ్చారు. సుకుమార్ Sir సినిమా కథలో కూర్చుని Discussion చేసేంత స్థాయి నాకు లేదు రాదు.ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప , ఆయనకి ఇచ్చేంత లేదు pic.twitter.com/KN7qmbLg6X
— BuchiBabuSana (@BuchiBabuSana) July 28, 2022