పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. తాజాగా ఈ చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్సె రిలీజ్ చేశారు. అందులో “భీమ్లా నాయక్” బ్రేక్ టైంలో ఏం చేస్తున్నాడో చూపించారు. పవన్ గన్ తో ఫైరింగ్ చేస్తూ మోత మోగిస్తున్న ఈ వీడియోతో మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఈ వీడియో వెనుక అసలు కారణం వేరే ఉన్నట్టుగా తెలుస్తోంది. “భీమ్లా నాయక్” విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ రూమర్స్ ను పటాపంచలు చేస్తూ వీడియో ద్వారా మరోసారి సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికే ఈ సినిమా విడుదలకు డేట్ ఖరారు చేసింది చిత్రబృందం.
Read Also : అఫిషియల్ : మెగాస్టార్, మెహర్ రమేష్ “మెగా యుఫోరియా”
“భీమ్లా నాయక్” త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన స్క్రీన్ ప్లేతో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్”కు రీమేక్ ఇది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న విడుదల కానుంది.