Brahmastra Pre Release Event:బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేయడం విశేషం. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం వరుస ప్రమోషన్స్ తో బిజీగా మారిపోయింది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నట్లు తెలపడంతో తారక్ ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు.
ఇక కొద్దిసేపటిలో ఈవెంట్ మొదలు కాబోతుందని ఆశతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందంటూ మేకర్స్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే క్యాన్సిల్ అవ్వడానికి కారణం వినాయకుడి ఉత్సవాలని తెలుస్తోంది. ఫిల్మ్ సిటీ ఖాళీ స్థలంలో అభిమానుల మధ్య ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేశారు. అయితే పోలీసులు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించారు. అనధికారంగా అందిన సమాచారం మేరకు రాత్రి ఎల్.బి.నగర్ లో వినాయకుని మండపం వద్ద జరిగిన ఓ రగడ వలన పోలీసులు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. చివరి నిమిషం వరకూ ఈవెంట్ సంస్థ ట్రై చేసినా కుదరలేదట. ఇక దీంతో ఈ వేడుకను పార్క్ హయత్ కు మారుస్తున్నారని తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో వెన్యూ చేంజ్ చేస్తుండడంతో లేట్ నైట్ అవుతుందని అంటున్నారు.మరి ఈవెంట్ ఏ సమయానికి ఆరంభమౌతుందో చూడాలి