మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి సంబరాలు ప్రారంభం అయ్యాయి.. ఇటలీలో వీరి పెళ్లి కానున్న విషయం తెలిసిందే.. టుస్కానీ వేదికగా జరుగుతున్న ఈ డెస్టి నేషన్ వెడ్డింగ్‌కు ఇప్పటికే ఏర్పాట్లు గ్రాండ్‌గా పూర్తయ్యాయి.. వీరి పెళ్లి వేడుకలో భాగంగా నిన్న రాత్రి కాక్ టెయిల్ పార్టీ ఘనంగా జరిగింది. కాబోయే దంపతులు వరుణ్, లావణ్యలతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్నారు. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఈ పార్టీలో మెగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇద్దరు కూడా వైట్ కలర్ డ్రెస్సులో మెరిశారు.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు వైట్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో ముస్తాబు చేశారు. ఇక అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ బ్లాక్ కలర్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం వరుణ్, లావణ్యల కాక్ టెయిల్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
ప్రస్తుతం హల్డీ వేడుక, పూల్ పార్టీ జరుగుతుంది.. ఈ వేడుకలో అందరూ ఎల్లో, వైట్, పింక్ కలర్ దుస్తులు ధరించారు. ఇక హల్దీ వేడుక కోసం లావణ్య కు ఓ స్పెషల్ లెహంగా డిజైన్ చేయించారు. లావణ్యా త్రిపాఠి తల్లి చీరతో ఈ లెహంగా తయారైంది. హల్దీ వేడుక ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఈ డ్రెస్‌ను డిజైన్ చేశారు. ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు ఈ లెహెంగాను డిజైన్ చేశారు. ఇక హల్దీ వేడుక పూర్తి అయిన తర్వాత సాయంత్రం ఐదున్నరకు మెహందీ వేడుకలు మొదలవుతాయి.. ఈ వేడుకల్లో కూడా మెగా, అల్లు ఫ్యామిలీలు సందడి చెయ్యనున్నారు.. నవంబర్ 1 న వరుణ్ తేజ్, లావణ్యలు ఒక్కటిగా కానున్నారు. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 2.48 గంటలకు లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇక పెళ్లి ముగిసిన తర్వాత రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి రిసెప్షన్ కార్యక్రమం జరుగుతుంది.. ఆ తర్వాత 5 న హైదరాబాద్ లో గ్రాండ్ గా పార్టీ జరగనుంది..
All about the Last night #VarunLav ✨ cocktail party🎉#VarunTej #LavanyaTripathi
Global Star #RamCharan
Icon StAAr #AlluArjun pic.twitter.com/moBvNIZBqK— RamCharan FC™ (@AlwayzCharanFC) October 31, 2023