Brahmaji: నటుడు బ్రహ్మాజీ గురించి అందరికి తెల్సిందే. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా ఆయన నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్రహ్మాజీ ఎప్పుడూ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకోడు. ఇక బ్రహ్మాజీ కొడుకు సంజయ్ ఇటీవలే పిట్టకథ సినిమాతో హీరోగా పరిచయమయిన విషయం విదితమే. సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు కానీ సంజయ్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే తన కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంజయ్, బ్రహ్మాజీ సొంత కొడుకు కాదట. ఈ విషాయన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మొట్టమొదటిసారి తన కుటుంబం గురించి ఓపెన్ అయ్యాడు.
నటుడిగా చెన్నైలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడే బ్రహ్మాజీ, ఒక బెంగాలీ అమ్మాయిని ప్రేమించాడట.. ఆమెనే పెళ్లి చేసుకున్నాడట. అయితే అప్పటికే ఆమెకు పెళ్లి అయ్యి ఒక బాబు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆ బాబు ఉండగా తనకు పిల్లలు వద్దని అనుకున్నాడట. అతడినే తన కొడుకుగా స్వీకరించి, ఇప్పుడు హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు బ్రహ్మాజీ గొప్ప మనసును ప్రశంసిస్తున్నారు. అయితే తనకంటూ ఒక బిడ్డ ఉండొద్దా అని చాలామంది అడిగారని, వాటన్నింటిని తాను లైట్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూనెట్టింట వైరల్ గా మారింది.