Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన హీరో రవితేజ.. ఈ ఏడాది లోనే రవితేజ రెండు వరుస హిట్లు అందుకున్నాడు. ఇక హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు కూడా. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి రవితేజ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా.. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రవితేజ.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాపై హైప్ పెంచుతున్నాడు. తాజాగా.. రవితేజ, సుశాంత్ లతో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో రవితేజ తన కొడుకు మహాధన్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
Bollywood: బాలీవుడ్ లో బతుకమ్మ.. అది మన రేంజమ్మ
మాస్ మహారాజా రవితేజకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి మహాధన్.. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పుడు రవితేజగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం చదువు పూర్తిచేస్తున్న మహాధన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నవారే. ఇదే ప్రశ్నను హరిశ శంకర్ కూడా బయటపెట్టాడు. “మాస్ మహారాజ్ ను చూశాం.. నెక్స్ట్ మాస్ యువరాజ్..మహాధన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంద” అని అడుగగా.. రవితేజ మాట్లాడుతూ.. “తెలియదు.. అస్సలు ఐడియా కూడా రాలేదు.. అసలు నాకు సంబంధం కూడా లేదు. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు.. ఇష్టం ఉంటే వస్తాడు. ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడు.. ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు.. ఇంట్రెస్ట్ ఉంది.. కానీ, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇండస్ట్రీకి వాడు వస్తానంటే.. వెళ్లు అని చెప్తా.. ఒక్క సలహా కూడా ఇవ్వను. వాడికి ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చేశాను. వాడు చాలా క్లారిటీగా ఉన్నాడు. వాడి గురించి నేను చెప్పడం కాదు.. తెలుసుకోవాలి. ఒకరి గురించి ఒకరు చెప్పుకోకూడదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యూచర్ లో మహాధన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే అవకాశాలు చాలా మెండుగానే కనిపిస్తున్నాయి అని అంటున్నారు అభిమానులు.