బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘విక్రమ్ వేద’ అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీ రీమేక్ కు కూడా ‘విక్రమ్ వేద’ అనే టైటిల్ నే కంటిన్యూ చేస్తున్నారు. అయితే సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఆ తాజా అప్డేట్ ఏమిటంటే… ‘విక్రమ్ వేద’ టీమ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ నుండి ఫస్ట్ లుక్‌ను రేపు విడుదల చేయబోతోంది. రేపు హృతిక్ పుట్టినరోజు సందర్భంగా హ్యాండ్సమ్ హంక్ లుక్ ను వేదగా పరిచయం చేస్తూ చిత్రబృందం విడుదల చేయబోతోంది.
Read Also : ‘ఆర్య’ నుంచే ఈ స్టార్ హీరో బన్నీ ఫ్యాన్ అట !!
వైనాట్ స్టూడియోస్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్‌తో కలిసి రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పుష్కర్ – గాయత్రి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. సెప్టెంబర్ 30న విడుదల కానున్న ‘విక్రమ్ వేద’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటి రాధికా ఆప్టే నటించనుంది. భారతీయ జానపద కథ ‘విక్రమ్ ఔర్ బేతాల్’ ఆధారంగా తెరకెక్కిన నియో-నోయిర్ యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం. ఓ గ్యాంగ్‌స్టర్‌ను చంపడానికి కఠినమైన పోలీసు అధికారి చేసే ప్రయత్నాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా ఈ మూవీలో చూపించారు.