అఖండతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను… స్కంద సినిమాతో అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. రామ్ కటౌట్‌కి మించిన యాక్షన్‌తో కాస్త నిరాశ పరిచాడు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి కానీ హీరో ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే కోలీవుడ్ హీరో సూర్యతో బోయపాటి టచ్‌లో ఉన్నాడని అన్నారు. అలాగే సరైనోడు తర్వాత బన్నీతో మరో మాస్ సినిమా ప్లాన్ చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. అయితే అఖండ సమయంలోనే సీక్వెల్‌ను అనౌన్స్ చేశాడు బోయపాటి శ్రీను. దీంతో బోయపాటి నెక్స్ట్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను సెట్ చేసినట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
2016లో ఈ కలయికలో ‘సరైనోడు చిత్రం వచ్చి… బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి గీతా ఆర్ట్స్‌లో బోయపాటి సినిమా ఫిక్స్ అయింది కానీ ఈ సినిమాలో హీరో ఎవరనేది బయటికి రాలేదు. ఆహా అన్‌స్టాపబుల్ షో సమయంలో అల్లు అరవింద్, బాలయ్యతో భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. ప్రజెంట్ బోయపాటి అఖండ సీక్వెల్ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. దీంతో అల్లు అరవింద్… గీత ఆర్ట్స్ బ్యానర్ పై బాలయ్యతో ప్లాన్ చేస్తున్నాడా? లేదంటే బన్నీతో ఉంటుందా? అనేది ఎగ్జైటింగ్‌గా మారింది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితోనే బోయపాటి, గీతా ఆర్ట్స్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ NBK 109 సినిమాతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ ‘పుష్ఫ 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి ఇద్దరిలో ఎవరితో బోయపాటి నెక్స్ట్ సినిమా ఉంటుందో చూడాలి.