అఖండతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను… స్కంద సినిమాతో అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. రామ్ కటౌట్‌కి మించిన యాక్షన్‌తో కాస్త నిరాశ పరిచాడు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి కానీ హీరో ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే కోలీవుడ్ హీరో సూర్యతో బోయపాటి టచ్‌లో ఉన్నాడని అన్నారు. అలాగే సరైనోడు తర్వాత బన్నీతో మరో మాస్ సినిమా ప్లాన్ చేశాడు కానీ వర్కౌట్ కాలేదు.…