వెల్కమ్ టు ఫిల్మ్ అప్టేట్స్.. పాండమిక్ టైంలో చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్.. బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సీజన్లో చాలా సినిమాలు సందడి చేశాయి.. ఆ తర్వాత సమ్మర్ సీజన్ మరింత వేడిగా సాగింది. ఇక ఇప్పుడు అరడజునుకు పైగా సినిమాలు.. ఇండిపెండెన్స్ డే టార్గెట్‌గా వస్తున్నాయి. దాంతో ఈసారి ఆగష్టులో బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.. మరి ఢీ అంటే ఢీ అంటున్న ఆ సినిమాలేంటి..?
కరోనా కారణంగా దాదాపు రెండేళ్లు సినిమాల సందడి తగ్గిపోయింది. దాంతో ఓటిటికి డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కాబట్టి.. పెద్ద సినిమాలైతే వారానికి ఒకటి.. చిన్న సినిమాలైతే.. రెండు మూడు రిలీజ్ అవుతున్నాయి. అయినా కూడా కొన్ని సినిమాలకు ఇంకా స్లాట్ దొరకడం లేదు. దాంతో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవక తప్పడం లేదు. అయితే ఆగష్టులో మాత్రం.. ఈ సారి బిగ్ వార్ జరగబోతోంది. ఇప్పటికే చాలా సినిమాలు ఆగష్టు బరిలో దూకేందుకు రెడీ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు కూడా అదే టైంలో వచ్చేందుకు సై అంటున్నాయి. వాటిలో అఖిల్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ ఆగష్టు 12 రిలీజ్ కాబోతోంది. అదే రోజు సమంత ‘యశోద’ మూవీ కూడా రాబోతోంది. అలాగే నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజక వర్గం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తంగా ఆగష్టు 12న మూడు సినిమాలు రాబోతున్నాయి. ఇక ఒకరోజు ముందుగా.. అంటే ఆగష్టు 11న అమీర్ ఖాన్, నాగ చైతన్య నటించిన బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ రాబోతోంది. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.
అదే రోజు తమిళ్ నుంచి చియాన్ విక్రమ్ దూసుకొస్తున్నారు. విక్రమ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘కోబ్రా’ ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. అయితే ఇవన్నీ లైన్లో ఉండగానే.. మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ కూడా అదే టైంలో బరిలోకి దిగబోతోందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాల కంటే ఒక వారం ముందు.. కళ్యాణ్ రామ్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘బింబిసార’ రాబోతోంది. అదే రోజు హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, రష్మిక నటిస్తున్న ‘సీతా రామం’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత కూడా మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆగష్టు 25న, పూరి జగన్నాథ్ లైగర్ హంట్ మొదలు కానుంది. దీంతో ఆగష్టులో బాక్సాఫీస్ వద్ద పోటీ రసవత్తరంగా సాగనుందని చెప్పొచ్చు. మరి ఈ పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది తెలియాలంటే.. ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిందే.