Vaishnavi Chaitanya: జీవితంలో ఎవరికైనా తామెంటో నిరూపించుకొనే ఛాన్స్ వస్తుంది. అది వచ్చాకా వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా నేటినటుల జీవితాలను మార్చేస్తుంది. బేబీ సినిమా వైష్ణవి చైతన్య జీవితాన్ని మార్చేసింది. ఒక యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించి, చిన్నా చితకా క్యారెక్టర్లతో సినిమాల్లోకి అడుగుపెట్టిన వైష్ణవిని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మార్చేసింది బాబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఎలాంటి రికార్డ్స్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత అమ్మడు కుర్ర హీరోలకు బెస్ట్ అప్షన్ గా మారిపోయింది. ఇప్పటికే సాయి రాజేష్ దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఇది కాకుండా ఈ మధ్యనే దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఇక ఇప్పుడు స్టార్ బాయ్ సిద్దు సరసన రొమాన్స్ చేయడానికి సిద్దమయ్యింది.
డీజే టిల్లుతో స్టార్ హీరోగా మారిన సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ తో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా తెలుసు కదా అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ రెండు సినిమాలు కాకుండా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో సిద్దు సరసన వైష్ణవి నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. నేడు బేబీ పుట్టినరోజు కావడంతో ఆమె పోస్టర్ ను రిలీజ్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బ్లాక్ కలర్ డ్రెస్.. ముక్కుకు పోగు పెట్టుకొని ముస్లిం యువతీలా వైష్ణవి కనిపించింది. వచ్చిన సినిమాలన్నింటిని ఒప్పుకోకుండా వైష్ణవి ఆచితూచి అడుగులు వేస్తుంది. మరి ఈ సినిమాలతో ఈ చిన్నది ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.