బాలీవుడ్ స్టార్ వారసుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీతో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల్ అభిషేక్, తన భార్య ఐశ్వర్య కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. అక్కడినుంచి తిరిగి వస్తూ ఎయిర్ పోర్ట్ లో బచ్చన్ కుటుంబం మీడియా కంటపడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్ళింది. దీంతో ఆమె నడకపై ట్రోలింగ్ ఎక్కువయ్యింది. ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూతురు చెయ్యి వదలకుండా పట్టుకొని నడిపిస్తుండడం, ఆరాధ్య కొద్దిగా వంకరగా నడవడంతో ఆమె కాలికి ఏదో అయ్యిందని పుకార్లు గుప్పుమన్నాయి.
ఇక ఈ ట్రోలింగ్స్ పై తాజాగా అభిషేక్ స్పందించారు. తన కొత్త చిత్రం ‘బాబ్ బిశ్వాస్’ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ మాట్లాడుతూ” నన్ను ట్రోల్ చేయండి .. ఎందుకంటే నేను పబ్లిక్ ఫిగర్ ని కాబట్టి .. మీరు ఎన్ని అన్నా పడతాను.. కానీ, నా కూతురును అనడానికి మీకు హక్కు లేదు.. తనకు , మీకు ఎటువంటి సంబంధం లేదు. దమ్ముంటే ఆ ట్రోలింగ్ నా ఎదురుగా వచ్చి చేయండి” అంటూ ట్రోలర్స్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాల్యేఊద్ మీడియాలో కలకలం రేపుతోన్నాయి.