Telugu indian idol: కంటెస్టెంట్స్ ప్రతిభకు బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ ఫిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AHA: ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’కు విశేష ఆదరణ లభిస్తోంది. ఇందులోని కంటెస్టెంట్స్ ప్రతిభను చూసి బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సంగీతం ఎల్లలు లేని ప్రపంచ స్థాయి భాష. అదే ఇవాళ తెలుగు ఇండియన్ ఐడల్ అనే విశ్వవేదికపై యువ గాయకులు తమ ప్రతిభను చాటేందుకు దోహదపడుతోంది. తెలుగుపాట ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువారి చెవికి చేరుతోంది. షో లో ప్రస్తుతం ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు. సామాన్య ప్రేక్షుకులే కాక ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు.
పోటీలో భాగంగా ఇటీవల నిర్వహించిన ‘గాలా విత్ బాలా’ ఎపిసోడ్ లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలోని ‘ఎంకిమీడ నా జతవిడి…’ సాంగ్ విన్న ప్రముఖ నేపధ్య గాయని శ్రేయాఘోషల్ సంతోషం వ్యక్తం చేశారు. సౌజన్య గాత్రం అత్యంత మధురంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆ చిత్రంలో ఒరిజినల్ పాటను శ్రేయానే ఆలపించారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సంగీతకారులు విశాల్ దద్లాని, హిమేష్ రేషిమియా షో కు వస్తున్న ఆదరణను ప్రశంసించారు. ఈ షో ఇలాగే దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించి, కంటెస్టెంట్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘గాలా విత్ బాలా’ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో ఉగాది ఛాలెంజ్ పేరుతో రెండు ఎపిసోడ్స్ జరిగాయి. ఈ షో గురించి ఆహా మార్కెటింగ్ హెడ్ కార్తీక్ కనుమూరు మాట్లాడుతూ “తెలుగు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్స్ తమ గాత్రంతో యావత్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందండం చాలా సంతోషంగా ఉంది. ఆహా ఓటీటీ ఈ షో ద్వారా ప్రతిభావంతులైన గాయకులను ప్రపంచానికి పరిచయం చేయడంలో విజయవంతమౌతోంది. రానున్న రోజుల్లో ఈ షో ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు తెలుగు సంగీత ప్రపంచంలో తమ స్థానాన్ని సుస్థిర పరుచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు” అని అన్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కార్యక్రమం ప్రతి శుక్ర, శని వారాల్లో రెండు ఎపిసోడ్లుగా రాత్రి 7 గంటల నుంచి ఆహాలో ప్రసారం అవుతోంది.
Also Read
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!