Mammootty vs Dulquer Salmaan: బాక్సాఫీస్ వద్ద అరుదైన పోరు.. ఒకే రోజు బరిలోకి దిగుతున్న తండ్రీకొడుకులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mammootty vs Dulquer Salmaan: సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో ఆసక్తికరమైన పోటీలు చూస్తుంటాం. కానీ, ఎప్పుడు జరగని విడ్డురం ఇప్పుడు దక్షిణాది చిత్రసీమలో క్లాష్ జరగబోతోంది. కాకపోతే అదికూడా సొంత భాషలో కాకుండా.. వేర్వేరు భాషల చిత్రాలతో తండ్రీకొడుకులు ఒకే రోజు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ మరో వారంలో ఈ విచిత్రమైన బాక్సాఫీస్ ఫైట్‌కు సిద్ధమవుతున్నారు.
తెలుగు సినిమాతో దుల్కర్ సల్మాన్
మలయాళం కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా మారిపోయారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండటంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read
- Chiranjeevi: ఆర్టిస్టుల గౌరవం, గుర్తింపును కాపాడాలి.. AI దుర్వినియోగంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం.!
- CM Vijaya: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. 92 వేల మంది రైతులు, టీచర్లకు భారీ ఊరట
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. మళ్లీ బెజవాడకు సీబీఐ
- OM Movie Title Changed: షాకిచ్చిన సెన్సార్.. ‘ఓం’ టైటిల్లో మార్పు..!
తమిళ చిత్రంతో మమ్ముట్టి ఎంట్రీ
మరోవైపు, దుల్కర్ తండ్రి లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ఓం’ (O.M) కూడా సరిగ్గా నవంబర్ 20నే విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్న పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో మమ్ముట్టి ఒక అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంపై కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి.
హాట్ టాపిక్‌గా మారిన పోరు
మలయాళ హీరోలైన తండ్రీకొడుకులు ఇద్దరూ పక్క ఇండస్ట్రీల సినిమాలతో ఒకే రోజు పోటీ పడుతుండటం సినీ అభిమానులకు ఫుల్ కిక్కిస్తోంది. ఒకవైపు దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమాతో వస్తుంటే.. మరోవైపు మమ్ముట్టి స్ట్రెయిట్ తమిళ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి నవంబర్ 20న జరగబోయే ఈ విచిత్రమైన బాక్సాఫీస్ పోరులో కొడుకు తెలుగులో హిట్ కొడతాడా..? లేక తండ్రి తమిళంలో సత్తా చాటుతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Mammootty vs Dulquer Salmaan: బాక్సాఫీస్ వద్ద అరుదైన పోరు.. ఒకే రోజు బరిలోకి దిగుతున్న తండ్రీకొడుకులు..!
-
Jay Shah Journey: 2009లో మెదలైన ప్రయాణం.. జై షా ప్రస్థానంలో కీలక మైలురాళ్లు.. బీసీసీఐ నుంచి ఐసీసీ వరకు!
-
Chiranjeevi: ఆర్టిస్టుల గౌరవం, గుర్తింపును కాపాడాలి.. AI దుర్వినియోగంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం.!
-
CM Vijaya: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. 92 వేల మంది రైతులు, టీచర్లకు భారీ ఊరట
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!