సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగుతోంది. ఇటివలే షెడ్యూల్ బ్రేక్ రావడంతో మహేశ్ బాబు, ఫారిన్ ట్రిప్ వెళ్లాడు. మహేశ్ అవైలబిలిటీలోకి రాగానే త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చెయ్యనున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారని ఇప్పటికే అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఒకరు ఫస్ట్ హీరోయిన్, ఇంకొకరు సెకండ్ హీరోయిన్ కాదు… ఇద్దరూ హీరోయిన్లు, మహేశ్ బాబు హీరో అంటూ ప్రొడ్యూసర్ నాగవంశీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడు మరో బ్యూటీ కూడా SSMB 28లో జాయిన్ అవనుందని సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.
ఈ రూమర్ ప్రకారం… SSMB 28లో బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్‌ను కీలక పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర సెకండ్ హాఫ్‌లో చాలా కీలకంగా ఉంటుందట. అది కూడా పోలీస్ ఆఫీసర్ రోల్ అని, భూమి పడ్నేకర్ కూడా ఓకే చెప్పిందని ట్విట్టర్ లో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లో భూమికంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. విభిన్న పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటోంది కానీ నార్త్ లో అమ్మడు ఆశించినంత స్టార్‌డమ్ సొంతం చేసుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మహేశ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది అనే మాట నిజం అయితే మాత్రం… భూమి పడ్నేకర్ కి టాలీవుడ్ లో మంచి ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. ఇంతకు ముందు మృణాల్ ఠాకూర్ కూడా బాలీవుడ్‌లో ఆకట్టుకోలేకపోయింది కానీ సీతారామం మూవీలో సీత పాత్రతో తెలుగులోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు భూమి పడ్నేకర్ కూడా మహేష్‌తో ఛాన్స్ అందుకుంటే మాత్రం అమ్మడి దశ తిరిగినట్టే. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.