బాలీవుడ్ లో డిసెంబర్ 1న బాక్సాఫీస్ వార్ భారీగా జరగబోతుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న అనిమల్ సినిమా… మేఘ్నా డైరెక్ట్ చేస్తున్న సామ్ బహదూర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కి రెడీ అయ్యాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన సామ్ బహదూర్ సినిమా అనౌన్స్మెంట్ రోజునే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు కానీ అనిమల్ మాత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే అనిమల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన సందీప్, టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇటీవలే అనిమల్ మూవీ నుంచి వచ్చిన అమ్మాయి సాంగ్ సినిమాకి మరింత బజ్ జనరేట్ చేసింది. సాంగ్ లో రణబీర్ కపూర్-రష్మికల కెమిస్ట్రీకి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. లవ్ స్టోరీ చేయాలన్నా, యాక్షన్ ఎపిసోడ్స్ చేయాలన్నా సందీప్ రెడ్డి వంగ స్టైల్ యే వేరు అంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. మరో వైపు ప్రమోషన్స్ ని స్లో స్టార్ట్ చేసిన సామ్ బహదూర్ చిత్ర యూనిట్… ఇటీవలే టీజర్ లాంచ్ చేసారు.
ఫీల్డ్ మార్షల్ సామ్ బహదూర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా, టీజర్ తో అంచనాలని పెంచేసింది. ఉరి, సర్దార్ ఉద్ధం సింగ్ తర్వాత విక్కీ కౌశల్ నుంచి వస్తున్న ఆ స్థాయి సినిమా సామ్ బహదూర్ అవ్వడంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే మాస్ ఆడియన్స్ అంతా అనిమల్ మూవీకి, క్లాస్ ఆడియన్స్ అంతా సామ్ బహదూర్ సినిమాకి వెళ్తారేమో. ఏ సినిమా ఆడియన్స్ ఆ సినిమాకి ఉన్నా కూడా రెండు పెద్ద సినిమాలు ఒకటే రోజున రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. థియేటర్స్ నుంచి కలెక్షన్స్ వరకూ ప్రతి విషయంలో అనిమల్, సామ్ బహదూర్ సినిమాలకి దెబ్బ తగలడం గ్యారెంటీ. మరి ఏ సినిమా అయినా ముందుకి కానీ వెనక్కి కానీ వెళ్తుందేమో చూడాలి.